జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్, ఐజ మండలాల్లోని కంటైన్మెంట్ ప్రాంతాల్లో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రాములు పర్యటించారు. కంటైన్మెంట్ ప్రాంతాల ప్రజలతో మాట్లాడారు. ప్రజలెవరూ ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని సూచించారు.
'ప్రజల సహకారంతోనే కరోనా నివారణ సాధ్యం'
కరోనా మహమ్మారి నివారణకు ప్రజలు సహకరించాలని జోగులాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కోరారు. అలంపూర్, ఐజ మండలాల్లో ఆర్డీఓ రాములుతో కలిసి పర్యటించారు.
గద్వాలలో అదనపు కలెక్టర్ పర్యటన
అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చే వారు కచ్చితంగా మాస్కులు ధరించాలని ఆర్డీఓ రాములు విజ్ఞప్తి చేశారు. కరోనా నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు.
కంటైన్మెంట్లో ఉన్న ప్రజలకు ప్రతిరోజు జనరల్ చెకప్‌లు నిర్వహించాలని ఆరోగ్య అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వారికి అవసరమైన నిత్యావసర సరుకులు, కూరగాయలు వాలంటీర్ల సాయంతో అందజేయాలని స్థానిక అధికారులకు సూచించారు.