జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చెక్ పోస్ట్‌ను ఇంఛార్జీ ఎస్పీ అపూర్వ రావు తనిఖీ చేశారు. పుల్లూరు టోల్ ప్లాజా వద్ద ఉన్న తనిఖీ కేంద్రాన్ని ఎస్పీ అపూర్వ రావు పరిశీలించారు. సరిహద్దు ప్రాంతంలో ఉన్న కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదు అవుతుండటం వల్ల జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో సిబ్బందికి, ఎస్పీ పలు సూచనలు అందించారు. ఆంధ్రప్రదేశ్ కర్నూల్ ప్రాంతం నుంచి వచ్చే వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అనంతరం డ్రోన్ల సహాయంతో రహదారిపై భద్రతను పర్యవేక్షించారు.
పుల్లూరు టోల్ ప్లాజాను తనిఖీ చేసిన ఇంఛార్జీ ఎస్పీ
జోగులాంబ గద్వాల జిల్లాలోని పుల్లూరు టోల్ ప్లాజాను ఇంఛార్జీ ఎస్పీ అపూర్వ రావు తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు.
డ్రోన్ల సాయంతో రహదారిపై భద్రతను పర్యవేక్షించిన ఇంఛార్జీ ఎస్పీ