జోగులాంబ గద్వాల జిల్లాలో జరుగుతున్న తుంగభద్ర పుష్కరాల్లో దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పాలనాధికారి శృతి ఓజా అధికారులను ఆదేశించారు. పార్కింగ్ ప్రదేశం నుంచి ఆలయానికి చేరుకోవడానికి వాహనాలను సమకూర్చాలన్నారు.
దివ్యాంగుల కోసం పుష్కరాల్లో ప్రత్యేక వాహనాలు: కలెక్టర్ - జోగులాంబ గద్వాల జిల్లా తాజా వార్తలు
తుంగభద్ర పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శృతి ఓజా అధికారులను ఆదేశించారు. కరోనా దృష్ట్యా పుష్కర ఘాట్ల వద్ద నిత్యం శానిటేషన్ చేయాలని సూచించారు. దివ్యాంగులు అమ్మవారి దర్శనం చేసుకునేందుకు పుష్కరఘాట్ల వద్ద వీల్ఛైర్లను ఏర్పాటు చేయాలన్నారు.
దివ్యాంగుల కోసం పుష్కరాల్లో ప్రత్యేక వాహనాలు: కలెక్టర్
దివ్యాంగులు అమ్మవారి దర్శనం చేసుకునేందుకు పుష్కరఘాట్ల వద్ద వీల్ఛైర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. కరోనా దృష్ట్యా పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆమె తెలిపారు. శాంతిభద్రతల పర్యవేక్షణ, ట్రాఫిక్ సమస్యలపై జిల్లా ఎస్పీ రంజన్ రతన్కుమార్తో కలెక్టర్ చర్చించారు.