ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాల జలాశయానికి వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతోంది. 2 లక్షల 42 వేల 800 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా.. 37 గేట్లు ఎత్తి దిగువకు 3 లక్షల 47 వేల 440 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1,045 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,044 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిలువ 9.255 టీఎంసీలుగా ఉంది.
జూరాలకు భారీ వరద... 37గేట్లు ఎత్తివేత - jurala project latest news
జూరాల పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల జూరాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 37 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
జూరాలకు భారీ వరద... 37గేట్లు ఎత్తివేత