తెలంగాణ

telangana

ETV Bharat / state

షీ టీమ్స్​ సమర్థవంతగా పనిచేస్తున్నాయి: ఎస్పీ - 2 L RUN

జోగులాంబ గద్వాల జిల్లాలో షీ టీమ్స్​ సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఎస్పీ లక్మీనాయక్​ కితాబిచ్చారు. షీ టీమ్స్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 కె రన్​ను ఆర్డీవోతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.

షీ టీమ్స్​ సమర్థవంతగా పనిచేస్తున్నాయి

By

Published : Mar 28, 2019, 10:52 AM IST

Updated : Mar 28, 2019, 11:19 AM IST

షీ టీమ్స్​ సమర్థవంతగా పనిచేస్తున్నాయి
మహిళల రక్షణ కోసం షీ టీమ్స్​ సమర్థవంతంగా పనిచేస్తున్నాయని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ లక్ష్మీ నాయక్​ అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన 2కె రన్​ను ఆర్డీవో రాములుతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. మహిళల భద్రత కోసం రద్దీ ప్రాంతాల్లో షీ టీమ్స్​ను ఎక్కువగా ఏర్పాటు చేశామన్నారు.

సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో కీలకంగా ఉన్నారని ఆర్డీవో రాములు తెలిపారు. వారి భద్రత మన బాధ్యతన్నారు.

పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం నుంచి వైఎస్సార్​ చౌక్​ మీదుగా 2 కె పరుగు సాగింది. అధిక సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన వారికి ఎస్పీ బహుమతులు అందించారు.
ఇవీ చూడండి:సీ-విజిల్ మానిటరింగ్ కేంద్రం పరిశీలన

Last Updated : Mar 28, 2019, 11:19 AM IST

ABOUT THE AUTHOR

...view details