తెలంగాణ

telangana

ETV Bharat / state

High Court: మరో శతాబ్దానికి సొమ్ము చెల్లిస్తారా: హైకోర్టు ఆగ్రహం - హైకోర్టు తాజా వార్తలు

జూరాల ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు కింది కోర్టు ఖరారు చేసిన పరిహారంలో సగం డిపాజిట్ చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరో శతాబ్దానికి సొమ్ము చెల్లిస్తారా అని వ్యాఖ్యానించింది. కరోనా వల్ల ప్రభుత్వమే డిపాజిట్ చేయలేకపోతే.. ఈ కష్టకాలంలో భూములు కోల్పోయిన రైతులు ఎలా బతుకుతారని సూటిగా ప్రశ్నించింది. రెండు వారాల్లో పరిహారం డిపాజిట్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.

High Court: మరో శతాబ్దానికి సొమ్ము చెల్లిస్తారా: హైకోర్టు ఆగ్రహం
High Court: మరో శతాబ్దానికి సొమ్ము చెల్లిస్తారా: హైకోర్టు ఆగ్రహం

By

Published : Jun 4, 2021, 8:52 PM IST

మహబూబ్​నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు సగం పరిహారం డిపాజిట్ చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గద్వాల, నారాయణపేట్ భూసేకరణ అధికారుల తీరుపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. జూరాల ప్రాజెక్టులో భూమి కోల్పోయిన రైతులకు 2010లో ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. పరిహారం న్యాయ సమ్మతంగా లేదంటూ కొందరు రైతులు గతంలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టును ఆశ్రయించారు.

పరిహారం పెంపు

విచారణ జరిపిన కోర్టు పరిహారాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ సివిల్ జడ్జి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ భూసేకరణ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ ఉత్తర్వులను నిలిపివేయాలంటే.. కింది కోర్టు ఖరారు చేసిన పరిహారంలో సగం డిపాజిట్ చేయాలని షరతు విధిస్తూ గతేడాది జనవరిలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల ప్రకారం 45 ఎకరాలకు సంబంధించి 4 కోట్ల రూపాయలను డిపాజిట్ చేయాల్సి ఉంది.

ఏడాదిన్నర దాటినా...

అధికారులు డిపాజిట్ చేయకపోవడంతో.. సుమారు వంద మంది రైతులు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలపై జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆదేశాలు జారీ చేసి ఏడాదిన్నర దాటినా... ఎందుకు డిపాజిట్ చేయలేదని ప్రశ్నించింది. కరోనా తీవ్రత వల్ల పరిహారం డిపాజిట్ చేయలేక పోయినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది వివరణ ఇచ్చారు.

విస్మయం వ్యక్తం చేసిన కోర్టు

ప్రభుత్వ వివరణ పట్ల ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. కరోనా వల్ల ప్రభుత్వమే పరిహారం డిపాజిట్ చేయలేక పోతే.. రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. భూములు కోల్పోయిన రైతులు కరోనా వేళ ఎలా బతకాలని అడిగింది. ప్రభుత్వం ఇచ్చి హామీ మేరకు డిపాజిట్ చేయడానికి ఇంకా ఎంత కాలం కావాలి.. మరో శతాబ్దం చేస్తారా పరిహారం ఇస్తారా అని వ్యాఖ్యానించింది. రెండు వారాల్లో సగం పరిహారం డిపాజిట్ చేయాలని... లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:ఆకలితో వెళ్లి.. కరెంటు స్తంభంలో ఇరుక్కొని.!

ABOUT THE AUTHOR

...view details