తెలంగాణ

telangana

ETV Bharat / state

జూరాలకు పోటెత్తిన వరద నీరు.. 52 గేట్లు ఎత్తి దిగువకు విడుదల - గద్వాల జిల్లా తాజా వార్తలు

ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాలకు వరద నీరు పోటెత్తుతోంది. ప్రస్తుతం 5 లక్షల 25వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 52 గేట్లు తెరిచి 5 లక్షల 50 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. జూరాల జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1045 అడుగులు కాగా.. ప్రస్తుతం 1035 నీటి మట్టంగా కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిని అంచనా వేస్తు గురువారం రాత్రి నుంచి సుమారు 50 గేట్ల ద్వారా దిగువకు నీరు విడుదల చేస్తూ జలాశయాన్ని ఖాళీ చేశారు.

జూరాలకు పోటెత్తిన వరద నీరు.. 52 గేట్లు ఎత్తి దిగువకు విడుదల
జూరాలకు పోటెత్తిన వరద నీరు.. 52 గేట్లు ఎత్తి దిగువకు విడుదల

By

Published : Oct 16, 2020, 7:47 PM IST

మహారాష్ట్ర, కర్నాటక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాలకు వరద నీరు పోటెత్తుతోంది. ప్రస్తుతం 5 లక్షల 25వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 52 గేట్లు ఎత్తి 5 లక్షల 50 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. జూరాల జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1045 అడుగులు కాగా.. ప్రస్తుతం 1035 నీటి మట్టంగా కొనసాగుతోంది. జూరాల పూర్తి స్థాయి నీటి నిల్వ 9.67 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 4.693 టీఎంసీలుగా ఉంది.

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిని అంచనా వేస్తూ గురువారం రాత్రి నుంచి సుమారు 50 గేట్ల ద్వారా దిగువకు నీరు విడుదల చేస్తూ జలాశయాన్ని సగం ఖాళీ చేశారు. కృష్ణా నీటి ఉద్ధృతి పెరగడం వల్ల బీచుపల్లి వద్ద శివాలయం నీట మునిగింది. నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోని వాసునగర్‌ కాలనీ వాసులను ముందు జాగ్రత్తగా ఇళ్లు ఖాళీ చేయించారు. నదిలోకి ఎవరూ వేటకు వెళ్లకుండా పోలీసులు, రెవెన్యూ అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.

కృష్ణానది పరివాక ప్రాంతాలలో కొన్ని చోట్ల పంటలు నీట మునిగాయి. వరద ఉద్ధృతి మరింత పెరుగుతుందన్న అంచనాల మేరకు తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ సీజన్‌లో జూన్‌ మొదలుకొని ఇప్పటి వరకు 963 టీఎంసీల వరద నీరు జూరాలకు వచ్చింది.

ఇదీ చదవండి:భారీ వర్షాలతో కృష్ణమ్మ ఉగ్రరూపం.. జూరాల ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తివేత

ABOUT THE AUTHOR

...view details