జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ ఉన్న ప్రాజెక్టుల నుంచి జూరాలకు 2 లక్షల 27 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 28 గేట్లు తెరిచి 2 లక్షల 23 వేల 948 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.
ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలానికి కృష్ణమ్మ పరుగులు - జూరాల జలాశయానికి జలకళ
కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాలకు వచ్చిన నీటిని వచ్చినట్లుగా శ్రీశైలంకు విడుదల చేస్తున్నారు.
ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాలకు జలకళ
ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1,045 అడుగులు కాగా... ప్రస్తుతం 1,042 అడుగులుగా ఉంది. పూర్తి నీటిమట్టం 9.657 టీఎంసీలకుగానూ... ప్రస్తుతం 8.087 టీఎంసీలకు చేరుకుంది.