తెలంగాణ

telangana

ETV Bharat / state

Heavy Floods: సాగర్​కు భారీ ఇన్​ఫ్లో.. జూరాలకు కొనసాగుతున్న వరద - jurala dam

ఎగువన కురిసిన వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. వాటి గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేయడం వల్ల రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. నాగార్జునసాగర్​ జలాశయానికి భారీ స్థాయిలో ఇన్​ఫ్లో ఉండగా.. జూరాలకు వరద ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది.

జూరాలకు కొనసాగుతున్న వరద
జూరాలకు కొనసాగుతున్న వరద

By

Published : Jul 30, 2021, 12:18 PM IST

సాగర్​కు భారీ ఇన్​ఫ్లో

నాగార్జునసాగర్​కు భారీ స్థాయిలో ఇన్​ఫ్లో కొనసాగుతోంది. దాదాపు 4 లక్షల క్యూసెక్కుల నీరు సాగర్​లోకి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 555.80 అడుగుల మేర వరకు నీరు చేరింది. గరిష్ఠ నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 222.73 టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉంది.

పులిచింతలలో 43.06 టీఎంసీల నీరు..

విద్యుదుత్పత్తికి 29 వేల 120 క్యూసెక్కులు, ఎస్సెల్బీసీకి 11 వందల క్యూసెక్కులు వదులుతుండగా... సాగర్ నుంచి మొత్తం 30 వేల 220 క్యూసెక్కులు దిగువకు వెళ్తోంది. అటు పులిచింతల ప్రాజెక్టుకు 27 వేల 873 క్యూసెక్కులు వస్తుండగా... అంతే మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నారు. 45.77 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను పులిచింతలలో... 43.06 టీఎంసీల నీరు ఉంది.

జూరాలకు వరద..

జూరాల జలాశయానికి వరద కొనసాగుతోంది. జలాశయం ఇన్‌ఫ్లో 4,65,500 క్యూసెక్కులుండగా.. 4,62,576 క్యూసెక్కుల నీరు బయటకు వదులుతున్నారు. జూరాల జలాశయం 47 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ 9.657 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 6.585 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ABOUT THE AUTHOR

...view details