Srisailam Project water level : ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. జూరాల, సుంకేశుల జలాశయాల నుంచి శ్రీశైలానికి లక్షా 52వేల 396 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 65 లక్షల క్యూసెక్కులు ఉండగా... 16 గేట్ల ద్వారా 40 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 9.65 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 8.20 టీఎంసీలు నిల్వ ఉంది.
కృష్ణమ్మ పరుగులు.. రేపు శ్రీశైలం గేట్లు ఎత్తనున్న అధికారులు - జూరాల ప్రాజెక్టుకు వరద
Srisailam Project water level : వర్షాలు తగ్గినా.. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో కృష్ణమ్మ ఇంకా పరుగులు పెడుతోంది. కృష్ణా వరదతో జూరాల, సుంకేశుల జలాశయాల నుంచి శ్రీశైలానికి ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టాని(215.807)కి చేరువలో (195.2102 టీఎంసీ) ఉన్నందున రేపు శ్రీశైలం ఆనకట్ట గేట్లు ఎత్తేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
దిగువన ఉన్న శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 881.30 అడుగులకు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలకు గానూ ఇప్పుడు 195.2102 టీఎంసీలకు చేరింది. పూర్తిస్థాయి నీటమట్టానికి చేరువలో ఉన్నందున.... రేపు శ్రీశైలం ఆనకట్ట గేట్లు ఎత్తేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం దిగువన ఉన్న నాగార్జునసాగర్ జలాశయం పూర్తి నీటినిల్వ 312.04 టీఎంసీలకు గానూ... ప్రస్తుతం 179.69 టీఎంసీలకు చేరింది. జలాశయం పూర్తి నీటిమట్టం 590 అడుగులకు...535.80 అడుగులకు చేరింది