జోగులాంబ గద్వాల్ జిల్లాలోని పులికల్లో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రానికి 20 వేల గన్నీసంచులు అవసరం ఉండగా.. ఆదివారం కేవలం 7 వేలు మాత్రమే వచ్చాయి. అప్పటికే వేచి చూస్తున్న రైతులు గన్నీసంచులను చూసి తక్కువగా తెచ్చారని సింగిల్ విండో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అనంతరం మూకుమ్మడిగా వాటిని తీసుకెళ్లారు. సంచుల కోసం రైతుల మధ్య తోపులాట జరిగింది.
చివరకు విండో సిబ్బంది జోక్యం చేసుకుని సర్ది చెప్పి గన్నీ సంచులు ఎవరెన్ని తీసుకున్నారో జాబితా రాసుకున్నారు. మండలంలోని ఎనిమిది కేంద్రాలకు కలిపి సుమారు 50 వేల గన్నీ సంచులు అవసరం ఉండగా.. ఆదివారం 10 వేలు రాగా 7 వేలు పులికల్‌కు, 3 వేలు సింధనూరుకు తీసుకెళ్లారు.