జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల మండలం పూడూరు గ్రామంలో మరుగుదొడ్డి కోసం గుంత తవ్వుతుండగా పురాతన బంగారు, వెండి నాణేలు లభ్యమయ్యాయి. స్వచ్ఛభారత్‌లో భాగంగా మరుగుదొడ్డి కోసం గుంత తవ్వే క్రమంలో ఒక మట్టి పాత్ర లభ్యమైంది. ఈ పాత్రలో సుమారు 30 నుంచి 40 వరకు బంగారు వెండి నాణేలు బయటపడ్డాయి. స్థానికులు కొంతమంది కొన్ని నాణేలు పట్టుకెళ్లారని సమాచారం. మిగతావి ఇంటి యజమాని వద్దే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నాణేలు బయటపడ్డ విషయం తమ దృష్టికి రాలేదని ఎమ్మార్వో జ్యోతి తెలిపారు. రేపు రీజినల్ అధికారిని గ్రామానికి పంపించి విచారిస్తామన్నారు.
గుంత తవ్వుతుండగా పురాతన నాణేలు లభ్యం - పురాతన నాణేలు లభ్యం
మరుగుదొడ్డి కోసం గుంత తవ్వుతుండగా పురాతన బంగారు నాణేలు లభ్యమైన ఘటన గద్వాల జిల్లాలోని పూడూరులో చోటు చేసుకుంది. అయితే దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదని ఎమ్మార్వో జ్యోతి తెలిపారు. గ్రామానికి అధికారులను పంపి విచారణ చేయిస్తామన్నారు.
నాణేలు లభ్యం