జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 135 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పంపిణీ చేశారు. తెలంగాణలో ఉన్న ప్రతి పేదింటి ఆడబిడ్డకు సీఎం కేసీఆర్ అండగా ఉంటున్నారని ఆయన అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరం లాంటివని ఎమ్మెల్యే తెలిపారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
తెలంగాణలో పుట్టిన ప్రతి ఆడబిడ్డకు సీఎం కేసీఆర్ అండగా ఉంటున్నారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
రైతులకు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల వల్ల ఎంతో లబ్ధి చేకూరుతోందని ఆయన అన్నారు. గతంలో ఏ నాయకులు చేయని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన చేస్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బీఎస్ కేశవ్, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'సాగునీటి కల్పనపై జీవన్‌రెడ్డి వ్యాఖ్యలు అవాస్తవం'