జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టోర్నమెంట్ను భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకె.అరుణ ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ నేటి నుంచి నాలుగు రోజులపాటు నిర్వహించనున్నారు. దాదాపు 18 జట్లు పాల్గొంటుండగా.. ప్రథమ బహుమతిగా లక్ష రూపాయల నగదును... ద్వితీయ బహుమతిగా యాభై వేలు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
'క్రీడాకారులకు నైపుణ్యం ఉన్నా... ఆదరణ కరువైంది' - గద్వాల జిల్లా వార్తలు
క్రీడాకారులకు ప్రభుత్వ సహాయ సహకారాలు అందండంలేదని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకె. అరుణ వ్యాఖ్యానించారు. గద్వాల జిల్లాలో ఫుట్బాల్ టోర్నమెంట్ను ఆమె ప్రారంభించారు.
'క్రీడాకారులకు నైపుణ్యం ఉన్నా... ఆదరణ కరువైంది'
రాష్ట్రంలో క్రీడాకారులకు నైపుణ్యం ఉన్నా... ఆదరణ కరువైందని డీకే అరుణ వ్యాఖ్యానించారు. సొంతంగా కష్టపడి క్రీడల్లో నైపుణ్యం పొందిన క్రీడాకారులను పిలిచి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప...ప్రభుత్వం సహాయ సహకారాలు అందించడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో చిన్నారులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
ఇదీ చూడండి:'ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్'గా హైదరాబాద్