జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక జలాశయాల నుంచి ఇన్‌ఫ్లో పెరిగింది. భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.65టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 9.39 టీఎంసీలు ఉంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2.67 లక్షల క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో 2.61 లక్షల క్యూసెక్కులుగా ఉంది. జలాశయం 19 గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతున్నారు. ప్రాజెక్టును చూడడానికి సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.
జూరాలకు మళ్లీ వరద.. 19 గేట్లు ఎత్తి దిగువకు నీరు
జూరాలకు జలాశయానికి వరద పోటెత్తుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 9.39 టీఎంసీలకు చేరింది.
జూరాల
Last Updated : Sep 11, 2019, 11:30 AM IST