జోగులాంబ గద్వాల జిల్లా రాజోలిలోని జాలర్ల పంటపండుతోంది. తుంగభద్ర నది డ్యాం దిగువన చేపల వేట సాగిస్తుండగా, 10.5 కేజీల నుంచి 15.5 కేజీల బరువున్న అయిదు చేపలు వలకు చిక్కాయి. మురిసిపోయిన జాలర్లు మార్కెట్‌కు తీసుకొచ్చి విక్రయించారు.
పంట పండింద. తుంగభద్ర నదిలో జాలర్లకు చిక్కిన భారీ మీనాలు - గద్వాల జిల్లా తాజా వార్తలు
సుంకేసుల జలాశయం గేట్లను మూసివేయడంతో.. తుంగభద్ర నదిలో జాలర్ల వలకు పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయి. బుధవారం రాజోలి, టి.గార్లపాడు గ్రామానికి చెందిన జాలర్లుకు భారీ చేపలు చిక్కాయి.
తుంగభద్ర నదిలో జాలర్లకు చిక్కిన భారీ మీనాలు
పెద్ద చేపలను చూసేందుకు మార్కెట్‌లోని ప్రజలంతా గుమిగూడారు. కొందరు వాటితో స్వీయచిత్రాలు దిగారు. కొవిడ్ నేపథ్యంలో చేపలు మేలు చేస్తాయని జనం ఆసక్తి చూపుతున్నారు.
ఇవీచూడండి:కొవిడ్ పంజా: 40 వేలు దాటిన మృతుల సంఖ్య