తెలంగాణ

telangana

ETV Bharat / state

కూరగాయలను రోడ్డుపై పారబోసి రైతుల ఆందోళన - gadwal district latest news

మార్కెట్​లో రైతుల నుంచి ఇష్టారాజ్యంగా రుసుం వసూలు చేస్తున్నారంటూ.. జోగులాంబ గద్వాల జిల్లా అయిజలో అన్నదాతలు రోడ్డెక్కారు. మార్కెట్‌కు తీసుకువచ్చిన కూరగాయలను రోడ్డుపై పారబోసి.. ఆందోళనకు దిగారు.

farmers protest at ieeja
అయిజలో రైతుల ఆందోళన

By

Published : Apr 2, 2021, 12:06 PM IST

అయిజలో రైతుల ఆందోళన

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. తైబజార్ గుత్తేదారుడు అధిక రుసుం వసూలు చేస్తున్నాడంటూ కూరగాయలను రోడ్డుపై పారబోసి నిరసన వ్యక్తం చేశారు. పురపాలక పరిధిలోని తైబజారు గేటు ఛార్జీలు ఇప్పటి వరకు రూ.20 నుంచి 25 వసూలు చేసేవారు. కానీ, ఇటీవల కొత్తగా వచ్చిన గుత్తేదారుడు గేటు ఛార్జీలు రెట్టింపు చేసినట్లు రైతులు వాపోయారు. ఇప్పటికే ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఉన్న తమను.. మార్కెట్​లో దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సైతం గుత్తేదారులకే వత్తాసుపలుకుతున్నారని ఆరోపించారు. రోడ్డుపై రైతులు చేస్తున్న ఆందోళనకు చిరు వ్యాపారులు మద్దతివ్వటంతో ఆందోళన తీవ్రతరమైంది.

ABOUT THE AUTHOR

...view details