తెలంగాణ

telangana

ETV Bharat / state

'కొత్త వ్యవసాయ చట్టంతో రైతులకు మేలు జరుగుతుంది' - jogulamba gadwal latest news

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టం ప్రతి రైతుకూ లబ్ధి చేకూర్చే విధంగా ఉంటుందని భాజపా నేత డీకే అరుణ పేర్కొన్నారు. ఈ చట్టంతో ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

DK Aruna says new agricultural act will benefit farmers
'కొత్త వ్యవసాయ చట్టంతో రైతులకు మేలు జరుగుతుంది'

By

Published : Sep 22, 2020, 8:08 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని.. ఏ ఒక్కరికీ అన్యాయం జరిగే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, భాజపా నేత డీకే అరుణ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ అబద్ధాలతో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని డీకే అరుణ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

కొత్త వ్యవసాయ చట్టం ప్రతి రైతుకు లబ్ధి చేకూర్చే విధంగా ఉంటుందని డీకే అరుణ పేర్కొన్నారు. కేసీఆర్​ తన అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయని, పంటలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని అరుణ పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులను పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. మంత్రి కేటీఆర్​కు సిరిసిల్లపై ఉన్న దృష్టి మిగతా జిల్లాలపై లేదని విమర్శించారు.

అంతకుముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్​ఆర్​ఎస్​ను వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​కు మెమోరాండం సమర్పించారు.

ఇదీచూడండి.. ధనార్జనే లక్ష్యంగా తెరాస దోపిడీ పర్వం సాగుతోంది: డీకే అరుణ

ABOUT THE AUTHOR

...view details