పురపాలక ఎన్నికల్లో భాజపాను గెలిపిస్తే... గద్వాలను స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేస్తానని మాజీ మంత్రి డీకే అరుణ హామీ ఇచ్చారు. పట్టణంలోని 37 వార్డులకు గానూ... 18 మంది కౌన్సిలర్ అభ్యర్థులను ప్రకటించారు. పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానన్నారు.
భాజపాను గెలిపిస్తే.. స్మార్ట్ సిటీ చేస్తా: డీకే అరుణ - dk aruna released bjp candidates
గద్వాల మున్సిపల్ ఎన్నికలకు 18మంది భాజపా అభ్యర్థుల జాబితాను మాజీ మంత్రి డీకే అరుణ విడుదల చేశారు. మిగతా అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామన్నారు. భాజపాను గెలిపిస్తే పట్టణాన్ని స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
భాజపాను గెలిపిస్తే.. స్మార్ట్ సిటీ చేస్తా: డీకే అరుణ
గద్వాలలోని ప్రధాన సమస్య అయిన... రైల్వై అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని ఆరున్నర ఏళ్లు గడిచినా తెరాస పూర్తి చేయలేదని విమర్శించారు. ఆర్వోబీ నిర్మాణం పేరుతో అధికార పార్టీ నాయకులు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చూడండి: ముజఫర్పుర్ ఆశ్రమం కేసుపై దర్యాప్తునకు 3 నెలల గడువు