తెలంగాణ

telangana

ETV Bharat / state

'చీఫ్ ఇంజినీర్ కార్యాలయం తొలగింపు నిర్ణయం సరికాదు'

సీఎం కేసీఆర్​ కొత్తగా చీఫ్​ ఇంజినీర్​ కార్యాలయాలు పెంచుతూ నిర్ణయం తీసుకుని గద్వాల జిల్లాలో కార్యాలయం ఎందుకు తరలిస్తున్నారని మాజీ మంత్రి డీకే అరుణ ప్రశ్నించారు. అందుకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మహబూబ్​నగర్​కు మూల ఆధారం అయిన జూరాల ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ కార్యాలయం తొలగింపు నిర్ణయం సరికాదన్నారు.

dk-aruna-comment-on-chief-engineers-office-dismissal-decision-wrong
'చీఫ్ ఇంజినీర్ కార్యాలయం తొలగింపు నిర్ణయం సరికాదు'

By

Published : Aug 12, 2020, 9:04 PM IST

గద్వాల జిల్లా కేంద్రంగానే జూరాల చీఫ్ ఇంజినీర్ కార్యాలయం కొనసాగించాలని మాజీ మంత్రి డీకే అరుణ డిమాండ్ చేశారు. గద్వాల జిల్లాపై సీఎం కేసీఆర్​ ఎందుకు అంత కక్ష కట్టారో అర్థం కావడం లేదన్నారు. ఉమ్మడి మహబూబ్​నగర్​కు మూలాధారం అయిన జూరాల ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ కార్యాలయం తొలగింపు నిర్ణయం సరికాదన్నారు.

చీఫ్ ఇంజినీర్ కార్యాలయాలు పెంచుతున్న క్రమంలో.. గద్వాల్లో ఉన్న కార్యాలయాన్ని ఎత్తేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అందుకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జూరాల ప్రాజెక్టు మరమ్మతులకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని కేసీఆర్​పై మండిపడ్డారు.

'చీఫ్ ఇంజినీర్ కార్యాలయం తొలగింపు నిర్ణయం సరికాదు'

ఇదీ చూడండి :కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రవేశ పరీక్షలా..: ఉత్తమ్​

ABOUT THE AUTHOR

...view details