తుంగభద్ర పుష్కరాలు నేటితో పదో రోజుకి చేరాయి. ఆదివారం కావడంతో పుణ్య స్నానాలు ఆచరించడానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్, పుల్లూరు, రాజోలి, వేణు సోంపురం పుష్కర ఘాట్లకి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరించి నదీమ తల్లికి పూజలు చేస్తున్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
భక్తుల రద్దీతో తుంగభద్ర నాలుగు పుష్కర ఘాట్లు కిటకిట - తుంగభద్ర పుష్కరాలు వార్తలు
తుంగభద్ర పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పుణ్య స్నానాలకి తరలి వచ్చారు. పుష్కరాలు ప్రారంభమై నేటికి పదిరోజులు కాగా జోగులాంబ జిల్లాలోని నాలుగు ఘాట్లు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి.
భక్తుల రద్దీతో తుంగభద్ర నాలుగు పుష్కర ఘాట్లు కిటకిట
దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు భారీగా బారులు తీరగా.. దర్శనానికి సుమారు గంట సమయం పడుతోంది. వికలాంగుల కోసం పురపాలక అధికారులు ట్రై సైకిల్‌ను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి:పదో రోజు పుష్కరాలు.. ఆదివారం కావడంతో పోటెత్తిన భక్తులు