జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు చెక్‌పోస్టు వద్ద వలస కార్మికుల రాకతో రద్దీ పెరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి పుల్లూరు చెక్‌పోస్టు మీదుగా తెలంగాణలోకి ప్రవేశించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.
వలస కార్మికులతో రద్దీగా మారిన గద్వాల చెక్‌పోస్టు - గద్వాల జిల్లా వార్తలు
ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు రద్దీ పెరిగింది. వలస కార్మికులకు అనుమతి ఇస్తుండడంతో.. జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు చెక్‌పోస్టు వద్ద సిబ్బంది అందరి వివరాలు నమోదు చేస్తున్నారు
వలస కార్మికులతో రద్దీగా మారిన గద్వాల చెక్‌పోస్టు
మే 2 నుంచి 25 వరకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి సంఖ్య 20వేల 22 మందికి చేరిందని తహశీల్దార్ లక్ష్మీ తెలిపారు. సోమవారం ఒక్కరోజే 1266 మంది రాష్ట్రంలోకి ప్రవేశించినట్టు స్పష్టం చేశారు. తెలంగాణలోకి ప్రవేశించేవారందరికీ వైద్య పరీక్షలు చేసి.. హోమ్ క్వారంటైన్‌కు పరిమితం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి:విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి నూతన మార్గదర్శకాలు