తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర సరిహద్దుల్లో అలర్ట్​.. వారికి కొవిడ్​ టెస్టులు తప్పనిసరి - covid tests at ap telangana border

Covid tests at borders: రాష్ట్రంలో కొవిడ్​, ఒమిక్రాన్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ పలు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర సరిహద్దుల్లో.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసి ప్రయాణికులకు పలు సూచనలు చేస్తున్నారు.

covid tests at alampur chowrastha
అలంపూర్​ చౌరస్తా వద్ద కరోనా పరీక్షలు

By

Published : Jan 8, 2022, 12:52 PM IST

Covid tests at borders: రాష్ట్రంలో కొవిడ్​, ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ జాగ్రత్తలు తీసుకొంటోంది. రాష్ట్ర సరిహద్దులు, రైల్వేస్టేషన్లలో కొవిడ్ క్యాంపులు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ప్రయాణికులకు వైద్య సిబ్బంది కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు. కళాశాలలు, పాఠశాలలకు సంక్రాంతి పండుగ సెలవులు రావడంతో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వైద్యారోగ్య శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ ఉంది.

చౌరస్తా కూడలికి వచ్చే ప్రయాణికులకు, విద్యార్థులకు వైద్య సిబ్బంది టెస్టులు చేస్తున్నారు. కొవిడ్​ పాజిటివ్ వచ్చిన వారికి మందులిచ్చి పలు జాగ్రత్తలు సూచించి.. హోమ్ ఐసోలేషన్​లో ఉండమని చెప్పి పంపిస్తున్నారు. తీవ్రత ఎక్కువగా ఉంటే ఆస్పత్రికి తరలిస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులు ఆపి మాస్క్ లేని వారికి మాస్కులిచ్చి కొవిడ్​ జాగ్రత్తలు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:ఊరెళ్తున్న భాగ్యనగరం.. హైదరాబాద్-విజయవాడ హైవేపై రద్దీ

ABOUT THE AUTHOR

...view details