జూరాల ప్రాజెక్టు వద్ద పార్కింగ్ పేరిట అక్రమ వసూళ్లు కొనసాగుతున్నాయి. పర్యటకులు వాహనాలను నిలుపడానికి వీలుగా కుడి, ఎడమ కాలువల వద్ద గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఖాళీ స్థలాలను శుభ్రం చేశారు. ఆ స్థలంలో వాహనాలు నిలపాలని పోలీసులు సూచించారు.
పార్కింగ్ కోసం డబ్బులు వసూలు చేయాలని గ్రామ పంచాయతీ సూచించినట్లు పార్కింగ్ నిర్వాహకులు తెలిపారు. పెద్ద వాహనానికి 30 రూపాయలు, ద్విచక్ర వాహనాలకు 20 నుంచి పది రూపాయలు వసూలు చేయడంపై పర్యటకులు మండిపడుతున్నారు.
ప్రాజెక్టు చూసేందుకు వస్తే పార్కింగ్ దోపిడి... - అక్రమ వసూళ్ల
జూరాల ప్రాజెక్టు వద్ద పార్కింగ్ కోసం అక్రమ వసూళ్లపై పర్యటకులు మండిపడుతున్నారు. పార్కింగ్ రుసుముల పేరుతో ఈ దోపిడి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ వసూళ్లపై పర్యాటకుల మండిపాటు
ఇవీ చూడండి : శ్రీశైలం నుంచి సాగర్‌కు వరద ప్రవాహం