తెలంగాణ

telangana

ETV Bharat / state

మోదీకి మంత్రి కేటీఆర్ సర్టిఫికెట్ అవసరం లేదు: డీకే అరుణ - కేటీఆర్​పై డీకే అరుణ ఆగ్రహం

క‌రోనా విష‌యంలో ప్రధాని మోదీకి ముందుచూపు ఉంటే సీఎం కేసీఆర్ నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారని భాజపా సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. క‌రోనా విష‌యంలో ప్రధానికి మంత్రి కేటీఆర్ సర్టిఫికెట్ అవ‌స‌రం లేదన్నారు. క‌రోనా పరీక్షలు నిర్వహించ‌డంలో తెలంగాణ ప్రభుత్వం చిన్న రాష్ట్రాల కంటే వెన‌క‌బ‌డిందని ఆరోపించారు.

dk aruna
dk aruna

By

Published : Jul 14, 2020, 9:08 PM IST

ప్రధాని మోదీని విమర్శించే స్థాయి మంత్రి కేటీఆర్‌కు లేదని భాజపా సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందని ఆరోపించారు. కరోనా పరీక్షలు పెంచాలని ప్రభుత్వాన్ని ముందు నుంచే భాజపా హెచ్చరించిందని తెలిపారు.

క‌రోనా విష‌యంలో ప్రధానికి కేటీఆర్ సర్టిఫికెట్ అవ‌స‌రం లేదన్నారు. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో కరోనా పరీక్షలు చేయడం లేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం క‌రోనా పరీక్షలు నిర్వహించ‌డంలో చిన్న రాష్ట్రాల కంటే వెన‌క‌బ‌డిందని పేర్కొన్నారు. క‌రోనా విష‌యంలో ప్రధానికి ముందుచూపు ఉంటే సీఎం కేసీఆర్ నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారని డీకే అరుణ మండిపడ్డారు.

ఇదీ చదవండి:ఔరా నల్లమల.. వన్యప్రాణులు భళా!

ABOUT THE AUTHOR

...view details