తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతుల పట్ల తెరాస సర్కారుది కపట ప్రేమ: డీకే అరుణ

జోగులాంబ గద్వాల జిల్లాలోని ధరూర్ మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పరిశీలించారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పట్ల తెరాస ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోందని అరుణ ఆరోపించారు.

bjp leader dk aruna fire on trs government
bjp leader dk aruna fire on trs government

By

Published : Dec 4, 2020, 12:41 PM IST

రైతులు పండించిన పంటలను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకుండా రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని ధరూర్ మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీకే అరుణ పరిశీలించారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తెచ్చి 15 రోజులు గడుస్తున్నా... అధికారులు కొనటం లేదని అరుణ ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

జిల్లాలో 55 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం... 15 మాత్రమే ఏర్పాటు చేయటం పట్ల మండిపడ్డారు. 40 వేల మెట్రిక్ టన్నులే లక్ష్యంగా కొనుగోలు చేస్తామని సర్కారు ఇచ్చిన హామీ... మాటలకు మాత్రమే పరిమితమైందని దుయ్యబట్టారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల పట్ల తెరాస ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోందని అరుణ ఆరోపించారు.

ఇదీ చూడండి:బ్యాలెట్​ ఓట్ల లెక్కింపులో భాజపా ఆధిక్యం..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details