BANDI SANJAY: తెరాస పాలన వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడం, వచ్చే ఎన్నికల్లో భాజపాను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండో రోజు ప్రశాంతంగా కొనసాగింది. భాజపా చేస్తున్న ఉద్యమాల వల్లే ఇన్నేళ్లు ఫాంహౌజ్‌కే పరిమితమైన సీఎం కేసీఆర్.. దేశం మొత్తం తిరుగుతున్నారని అన్నారు. తెలంగాణకు కేంద్రం 1.40 లక్షలిస్తే.. మోదీకి పేరొస్తుందని భయపడి రెండు పడక గదుల ఇళ్ల పేరుతో ఎవరికీ ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. మిలియన్ మార్చ్‌కు భయపడి కేసీఆర్ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చారన్నారు. శ్మశాన వాటికలు, రోడ్లు, మురికి కాల్వలు, కమ్యూనిటీ హాళ్లు, ఇళ్లు వీటన్నింటికీ కేంద్రం నిధులిస్తుంటే తెరాస సర్కారు ఫొటోలు, పేర్లు మార్చి ప్రజలను ఏమార్చుతున్నారని వివరించారు.
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఒట్టి మాటేనన్న సంజయ్.. 60 వేల కోట్ల బకాయిలు డిస్కంలకు చెల్లించకుండా ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లుగా చెబుతున్నారని మండిపడ్డారు. పెంచిన విద్యుత్ ఛార్జీల వల్ల బిల్లు చూస్తేనే కరెంటు షాక్‌కు గురయ్యే పరిస్థితి ఎదురవుతుందని చెప్పారు.
కొత్త ప్రాజెక్టు రాలేదు..