బడిబాట ప్రారంభించిన జిల్లా కలెక్టర్ - bal bhavan
జోగులాంబ గద్వాల జిల్లాలో అక్షరాస్యత శాతం చాలా తక్కువ ఉందని... దీనిని ముందుకు తీసుకెళ్లాలంటే బడిబాట కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ శశాంక్ తెలిపారు.
బడిబాట కార్యక్రమం ప్రారంభం
జోగులాంబ గద్వాల జిల్లాలోని బాల భవన్ సమీపంలో బడి బాట కార్యక్రమాన్ని కలెక్టర్ శశాంక్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఏడాది బడులు తెరిచేలోపు ఈ కార్యక్రమాన్ని ముందుగానే ప్రారంభించామని తెలిపారు. జిల్లా విద్యలో ఎంతో వెనుకబడిందని... విద్యా పరంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని సూచించారు. బడి బయట పిల్లలను బడిలో చేర్పించాలని గోడ ప్రతులను విడుదల చేశారు.