రాష్ట్రంలోని మద్యం దుకాణాల లైసెన్స్ (liquor tender) కోసం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు సైతం పోటీపడుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా(gadwal district) అలంపూర్ చౌరస్తాలో రెండు మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ ప్రాంతం కర్నూలుకి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో దశలవారీగా మద్యపానం నిషేధం అమలులో ఉండటంతో... మద్యం రేట్లు విపరీతంగా పెరిగాయి. ఏపీతో పోల్చుకుంటే ఇక్కడ అన్ని రకాల బ్రాండ్ దొరుకుతుంది. ధరలు సైతం తక్కువగా ఉంటాయి. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన మద్యం ప్రియులు(Alcohol lovers) భారీ సంఖ్యలో ఇక్కడికి వస్తారు. ఒక్కో దుకాణంలో రోజుకి రూ. 20 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. అంటే మద్యం ప్రియుల తాకిడికి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మద్యం టెండర్ల (liquor tender) కోసం భారీ సంఖ్యలో పోటీపడుతున్నారు. ఈ ఒక్కరోజే 500 మంది లైసెన్సులు దక్కించుకోవడానికి దరఖాస్తు చేస్తే అందులో 350 మంది కేవలం ఈ రెండు దుకాణాల కోసమే వేశారంటే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పవచ్చు. ఇందులో ఏపీనుంచే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. దీంతో లైసెన్సుల కోసం స్థానికులు, స్థానికేతరుల మధ్య తీవ్ర పోటీ (liquor tender in telangana) ఏర్పడిందని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సైదులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు దరఖాస్తు చేసుకోవడం ఇబ్బందిగా ఉందని స్థానికులు చెబుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు సైతం టెండర్లలో (liquor tenders Competition) పాల్గొని... మద్యం దుకాణాలను దక్కించుకునే అవకాశం ఇచ్చిందని సైదులు పేర్కొన్నారు. ఈ నెల 20న డ్రా ద్వారా దుకాణాలను కేటాయించడం జరుగుతుందని తెలిపారు.