తెలంగాణ

telangana

ETV Bharat / state

లంచం తీసుకుంటుండగా వైద్యాధికారి పట్టివేత - వడ్డేపల్లిలో ఏసీబీ అధికారుల దాడులు

డీఎంహెచ్ఓ కార్యాలయంలో లంచం తీసుకుంటున్న వైద్యాధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గద్వాల జిల్లా వడ్డేపల్లి పీహెచ్‌సీకి ఈ మధ్య బదిలీ అయిన ఉద్యోగి రిలీవ్‌ కోసం రూ. 7 వేలు లంచం డిమాండ్‌ చేశారు.

లంచం తీసుకుంటుండగా వైద్యాధికారి పట్టివేత
లంచం తీసుకుంటుండగా వైద్యాధికారి పట్టివేత

By

Published : Jul 23, 2020, 7:53 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. వడ్డేపల్లి పీహెచ్‌సీలో పనిచేస్తున్న డాక్టర్ మంజుల గత నెలలో కరీంనగర్ నుంచి వడ్డేపల్లికి బదిలీ అయ్యారు. అయితే ఆమె పీజీ చదువు కోసం రిలీవ్‌ చేయమని అడగ్గా.. గద్వాల జిల్లా వైద్యాధికారి భీమా నాయక్‌ రూ. 7 వేలు లంచం అడిగారు. రూ. 7 వేలు ఇస్తేనే రిలీవ్‌ చేస్తాననడం వల్ల మంజుల భర్త ఏసీబీని ఆశ్రయించారు.

గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు దాడి చేసి.. వైద్యాధికారి భీమా నాయక్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు మహబూబ్‌నగర్‌ ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే వారిని ఆశ్రయించాలని డీఎస్పీ కృష్ణ గౌడ్ కోరారు.

ఇదీ చూడండి:తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details