జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద తాకిడి స్వల్పంగా తగ్గింది. గత ఐదు రోజులుగా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు ప్రవహించి కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించాయి. సోమవారం మధ్యాహ్నం నుంచి వర్షం కాస్త విరామం ఇవ్వడం వల్ల మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం బ్యారేజ్‌లకు వరద ప్రవాహం తగ్గింది. సోమవారం వరకు లక్ష్మీ బ్యారేజ్ లో 65 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు తగ్గిన వరద నీటి తాకిడి!
కాళేశ్వరం ప్రాజెక్టుకు స్వల్పంగా వరద తాకిడి తగ్గింది. గత ఐదు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు గోదావరి, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించాయి. మంగళవారం వర్షం కాస్త విరామం ఇవ్వగా.. కాళేశ్వరం ప్రాజెక్టలోని మేడిగడ్డ బ్యారేజ్ , అన్నారం బ్యారేజ్‌లకు వరద ప్రవాహం తగ్గింది.
గోదావరి,ప్రాణహిత ద్వారా వెళ్లే నీటి ప్రవాహం ఇన్ ఫ్లో 8 లక్షల 50 వేల క్యూసెక్కులు రాగ, ఔట్ ఫ్లో 9 లక్షల 87 వేల క్యూసెక్కులుగా నమోదయింది. అన్నారం బ్యారేజ్‌కు మానేరు, ఇతర వాగులు ద్వారా లక్షా 9 వేల క్యూసెక్కుల వరద నీరు రాగ 51 గేట్ల ద్వారా అంతే స్థాయిలో నీటిని దిగువకు వదిలారు. మంగళవారం లక్ష్మీ బ్యారేజ్‌కు గోదావరి, ప్రాణహిత ద్వారా 3 లక్షల 85 వేల క్యూసెక్కుల నీరు రాగా 65 గేట్లు ద్వారా 4 లక్షల 5 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు తరలిస్తున్నారు. అన్నారం బ్యారేజ్ 25 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. తెలంగాణ , మహరాష్ట్రలో ఎగువన కురిసిన భారీ వర్షాలకు కాళేశ్వరం, త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదుల ప్రవాహం పుష్కర ఘాట్లను తాకుతూ 12 మీటర్ల మేర ఎత్తులో ప్రవహించి, మంగళవారం 9.70 మీటర్లకు తగ్గింది.
ఇదీ చూడండి :పిల్లల అమ్మకాలకు ఏజెంట్ వ్యవస్థ.. 'సృష్టి'oచిన ఆసుపత్రి