కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో, క్రమశిక్షణతో పని చేయాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దిశానిర్దేశం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో తెరాస ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. తాము అందరికీ అందుబాటులో ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఏ సమస్య ఉన్నా... తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గంలో రాష్ట్రంలోనే ఎక్కువ సభ్యత్వాలు చేపించాలని... అన్ని మండలాల కంటే ఘన్పూర్ మండలం నుంచి అత్యధిక సభ్యత్వలు నమోదు కావాలని సూచించారు.
నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి - undefined
జయశంకర్ భూపాల పల్లి జిల్లా గణపురంలో తెరాస పార్టీ సభ్యత్వ నమోదును ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
TRS MEMBERSHIP PROGRAM
TAGGED:
TRS MEMBERSHIP PROGRAM