జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం చెల్పూర్ జెన్‌కో కార్యాలయంలో తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్ పోలీస్, అటవీ అధికారుల ఒక రోజు కార్యశాల జరిగింది. ఇందులో ప్రధానంగా తడోబా, ఇంద్రావతి, కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రాల్లో తీసుకుంటున్న చర్యలు.. ఆయా అడవుల్లో పులుల సంఖ్య పెరగటం వల్ల ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుండటంతో తీసుకోవాల్సిన చర్యలు, సమన్వయంపై చర్చించారు.
'అడవులు, వన్యప్రాణుల రక్షణకు కలిసి పనిచేయాలి'
గోదావరి నది పరివాహాక ప్రాంతంలో అడవులు, వన్యప్రాణుల రక్షణ, కలప స్మగ్లింగ్ నివారణే ధ్యేయంగా కలిసి పనిచేయాలని తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్ అధికారులు నిర్ణయించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం చెల్పూర్ జెన్‌కో కార్యాలయంలో పోలీస్, అటవీ అధికారుల ఒక రోజు కార్యశాలలో పాల్గొన్నారు.
గోదావరి నది పరివాహాక ప్రాంతంలో అడవులు, వన్యప్రాణుల రక్షణ, కలప స్మగ్లింగ్ నివారణే ధ్యేయంగా కలిసి పనిచేయాలని నిర్ణయించారు. సరిహద్దు ప్రాంతాల్లో రెండు వైపులా కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు ద్వారా భద్రతను పటిష్ఠం చేయాలని నిర్ణయానికి వచ్చారు. అడువుల సంరక్షణలో తెలంగాణ చొరవను జాతీయ పులుల సంరక్షణ సంస్థ ప్రతినిధి ఎస్.ఎన్.మురళి అభినందించారు. పులుల సంరక్షణకు మరిన్ని నిధులను మంజూరు చేస్తామని ప్రకటించారు. ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లిలో పెద్దపులి సంచరిస్తున్నందున అడవి అభివృద్ధికి అవకాశం ఉందన్నారు.
ఇదీ చదవండి:సచివాలయ నిర్మాణ పనులు దక్కించుకున్న షాపూర్జీ పల్లోంజీ సంస్థ