తెలంగాణ

telangana

ETV Bharat / state

అల్లరి చేసిందని వాతలు వచ్చేలా కొట్టింది.. - anger

అల్లరి చేసిందని చిన్నారి వాతలు వచ్చేలా కొట్టింది ఆ కీచక టీచర్.

teach

By

Published : Feb 6, 2019, 11:42 AM IST

అల్లరి చేసిందని ఎల్​కేజీ చిన్నారిని చావగొట్టిందో టీచర్. పసిపాప అని ఏమాత్రం కనికరం లేకుండా ఒళ్లంతా వాతలు వచ్చేలా కర్ర విరిగే వరకు కొట్టింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపూర్ మండలంలోని ప్రైవేటు పాఠశాలలో జరిగింది. స్థానిక ప్రైవేట్ పాఠశాలలో కావ్య ఎల్​కేజీ చదువుతోంది. అల్లరి చేసినందుకు తరగతి టీచర్ బెత్తం విరిగేలా కొట్టింది. చిన్నారి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి బాధను చెప్పుకోవటంతో ప్రిన్సిపల్​​కు ఫిర్యాదు చేశారు. పిల్లలకు విద్య నేర్పించేది ఇలాగేనా.. అంటూ అగ్రహం వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details