జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా బాధితుల కోసం సేవ్ ద చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు 25 ఆక్సిజన్ కాన్సులేటర్లను అందజేయడం సంతోషకరమని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. ఆ పరికరాలను జిల్లా ఆసుపత్రితో సహా, చిట్యాల, మహాదేవపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స కోసం ఉపయోగిస్తామని తెలిపారు.
స్వచ్ఛంద సంస్ధ ఆధ్వర్యంలో 25 ఆక్సిజన్ కాన్సులేటర్లు అందజేత - భూపాలపల్లి జిల్లాలకు ఆక్సిజన్ కాన్సులేటర్ల పంపిణీ
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా బాధితులను ఆదుకునేందుకు సేవ్ ద చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు ముందుకొచ్చారు. వారి సంస్థ తరఫున 25 ఆక్సిజన్ కాన్సులేటర్లను జిల్లా ఇంఛార్జీ కలెక్టర్ కృష్ణ ఆదిత్యకు అందజేశారు.
భూపాలపల్లి జిల్లాలకు ఆక్సిజన్ కాన్సులేటర్ల పంపిణీ
ఈ సందర్భంగా జిల్లా ఇంఛార్జీ కలెక్టర్‌ను కలిసిన స్వచ్ఛంద సంస్థ సభ్యులు కలెక్టర్ కార్యాలయంలో ఆక్సిజన్ కాన్సులేటర్లను అందించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అదనపు కలెక్టర్ కూరాకుల స్వర్ణలత, డీపీఆర్వో రవికుమార్, సేవ్ ద చిల్డ్రన్ స్వచ్ఛంద రాష్ట్ర సీనియర్ మేనేజర్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదంవడి:'ప్రాణాలకు తెగించి సేవలందిస్తే.. డాక్టర్లపై దాడులా?'