తెలంగాణ

telangana

ETV Bharat / state

జయశంకర్​ జిల్లాలోని హోటళ్లపై దాడులు

జయశంకర్​ భూపాలపల్లిలోని పలు హోటళ్లపై ఫుడ్​ కంట్రోల్​ అధికారులు దాడులు నిర్వహించారు. వివిధ హోటళ్లలోని కొన్ని పదార్థాలను ఫొరెన్సిక్​ ల్యాబ్​కు పంపించారు.

By

Published : Aug 20, 2019, 12:08 AM IST

జయశంకర్​ జిల్లాలోని హోటళ్లలో దాడులు

జయశంకర్​ జిల్లాలోని హోటళ్లపై దాడులు
జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పలు హోటళ్ల​పై ఫుడ్​ కంట్రోల్​ ఇన్స్పెక్టర్​ కిరణ్​ కుమార్​ దాడులు నిర్వహించారు. కలెక్టర్​ వాసం వెంకటేశ్వర్లు ఆదేశాలతో సీఐ వాసుదేవరావు, ఎస్సై సాంబమూర్తి ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. బృందావన్​ హోటల్​లో ఫంగస్​ ఉన్న ఆలుగడ్డలు చూసి యజమానిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సితార, సింధూరి హోటళ్ల నుంచి కొన్ని పదార్థాలను ఫొరెన్సిక్​ ల్యాబ్​కు పంపించారు. రిపోర్టు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details