Kaleshwaram Project : తెలంగాణతో పాటు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరుతుంది. 1986లో 28 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదవ్వగా.. ప్రస్తుతం 28లక్షల 67వేల క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. ఫలితంగా మేడిగడ్డ పంప్ హౌస్ వరద నీటిలో మునిగిపోయింది. భారీగా వరద నీరు చేరడంతో మేడిగడ్డ 85 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. అన్నారం బ్యారేజీ ఇన్‌ఫ్లో 11,39,665 క్యూసెక్కులు కాగా.. ఉన్న 66 గేట్లను తెరిచి అంతే మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నారు.
కాళేశ్వరానికి రికార్డు స్థాయిలో వరద.. మేడిగడ్డ, అన్నారం గేట్లు ఎత్తివేత - record level floods to Kaleshwaram Projec
Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరుతుంది. మేడిగడ్డ బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 28,62,390 క్యూసెక్కులు కాగా.. మొత్తం 85 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. అన్నారం బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 11,39,665 క్యూసెక్కులు కాగా.. 66 గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నారు.
Record level floods to Kaleswaram Project and medigadda and annaram barrage all gates open
మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం, పోలీసు క్యాంపుల్లో చిక్కుకుపోయిన ఇంజినీర్లు, అధికారులను సీఆర్పీఎఫ్ జవాన్లు తీసుకొస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పడవల రెస్క్యూ పనుల్లో పాల్గొంటున్నాయి.