జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాత్రి నుంచి ఉదయం వరకు వర్షం ఎడతెరపి లేకుండా కురిసింది. ఈ వర్షానికి చెరువులు కుంటలు పొంగిపొర్లుతున్నాయి. సింగరేణి ఓపెన్ కాస్ట్ రెండో గనిలోకి వరద నీరు చేరి మూడు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఘనపూర్ మండలం మోరంచపల్లి వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. గణపసముద్రం చెరువులోకి నీరు 20 అడుగులకు చేరింది. మహముత్తారంలో 134.2, కటారంలో 127.8, భూపాలపల్లిలో 110.6 మీల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.
3 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం - అంతరాయం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సింగరేణి ఓపెన్ కాస్ట్ రెండో గనిలోకి వరద నీరు చేరింది. మూడు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
3 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం