జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి ఏరియా కేటీకే మొదటి గని కార్మికులు ఆందోళనకు దిగారు. తమ కార్మికులను పోలీసులు కొట్టారంటూ సింగరేణి అధికారులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ముక్కెర రవి అనే కార్మికుడు సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో పోలీసులు కొట్టారని ఆరోపించారు. అత్యవసర రంగంలో పనిచేస్తున్న తమకు భద్రత కల్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు. దాదాపు గంట పాటు మేనేజర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
కార్మికులకు రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కార్మిక సంఘాల నాయకులు కోరారు. విధులకు హాజరయ్యే వారికి మాస్క్లు, గ్లౌజులు పంపిణీ చేయాలన్నారు. సంఘటనపై పోలీసు ఉన్నతాధికారులకు వివరించామని సింగరేణి అధికారులు తెలిపారు.