తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో భక్తుల సందడి నెలకొందిది. మహాలయపక్షం అమావాస్య నేపథ్యంలో త్రివేణి సంగమంలో భక్తుల పెద్ద ఎత్తున వచ్చి పితృ తర్పణాలు నిర్వహిస్తున్నారు. వరంగల్, కరీంనగర్, హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాలు, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివస్తున్నారు.
కాళేశ్వరం త్రివేణి సంగమంలో పితృతర్పణాలు
రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మహాలయపక్షం అమావాస్య పురస్కరించుకుని భక్తులు గోదావరిలో పితృతర్పణాలు సమర్పిస్తున్నారు. బ్రాహ్మణులకు పితృదేవతల పేరు మీద దానాలు చేస్తున్నారు.
కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో భక్తుల పితృతర్పణాలు
పితృ తర్పణాలు, ఆమదానం, పిండప్రదానాలు చేస్తున్నారు. బ్రాహ్మణులకు పితృదేవతల పేరు మీద దానాలు చేస్తున్నారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి శార్ధకర్మలు నిర్వహిస్తున్నారు.
ఇదీ చూడండి :భారీ వర్షాలు... జలమయమైన లోతట్టు ప్రాంతాలు