pranahitha pushkaralu: ప్రాణహిత నదీ తీరం భక్తులతో కళకళలాడుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి భక్తులు తరలివస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, మంచిర్యాల జిల్లా అర్జున గుట్ట, కుమురంభీం జిల్లా తుమ్మడిహెట్టి పుష్కర ఘాట్లలో పుణ్య స్నానాలతో పాటు పితృదేవతలకు తర్పణాలు, పిండప్రదానాలు నిర్వహిస్తున్నారు. అనంతరం కాళేశ్వరం ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద నదీ హారతిని ఘనంగా నిర్వహించారు.
మంచి అనుభూతి..
పుష్కర స్నానం ఎంతో పుణ్య ఫలమని.. అందుకే వ్యయ ప్రయాసలను సైతం లెక్కచేయకుండా సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నామని భక్తులు తెలిపారు. పుష్కరాల్లో ఎడ్లబండ్లు ప్రత్యేక ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఎడ్ల బండ్ల మీద కొంత దూరం వెళ్లి త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించారు. ఎడ్ల బండ్ల మీద ప్రయాణం మంచి అనుభూతిని ఇచ్చిందని భక్తులు తెలిపారు. మరోవైపు తమకు ఉపాధి లభించిందని ఎడ్ల బండ్ల యజమానులు పేర్కొన్నారు.
భక్తుల ఆగ్రహం..