జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి ఇల్లందు క్లబ్లో నిర్వహించిన మున్సిపాలిటీ బడ్జెట్ సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, మరో ఇద్దరు సభ్యులతో.. అధికార పార్టీకి చెందిన నూనె రాజు, హరీశ్ రెడ్డి, మురళీధర్, మరికొంత మంది కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు ఒకరిపై మరొకరి ఆరోపణల నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
మున్సిపాలిటీ బడ్జెట్ సర్వసభ్య సమావేశంలో గందరగోళం
సింగరేణి ఇల్లందు క్లబ్లో నిర్వహించిన మున్సిపాలిటీ బడ్జెట్ సర్వసభ్య సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు వర్గాలను మున్సిపల్ ఛైర్ పర్సన్ వెంకటరాణి సముదాయించారు.
మున్సిపాలిటీ బడ్జెట్ సర్వసభ్య సమావేశం, సింగరేణి ఇల్లందు క్లబ్
కొద్దిసేపు సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇరు వర్గాలను మున్సిపల్ ఛైర్ పర్సన్ వెంకటరాణి సముదాయించారు. ఈ కార్యక్రమంలో ఛైర్ పర్సన్ సెగ్గం వెంకట రాణి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:సీఎస్ సోమేశ్‌కుమార్‌కు కరోనా పాజిటివ్