"రైతులు తమ భూముల కోసం పడుతున్న ఇబ్బందులు వర్ణించలేం. గతంలో పలువురు రైతులు పెట్రోలుతో ఎమ్మార్వో కార్యాలయాల ముందు నిరసనలు చేశారు. ఒక్కొక్క స్థాయి అధికారులపై అవినీతి కేసులు కూడా ఉన్నాయి. ప్రజల ధనం చేతులు మారుతున్న సంఘటనలు అనేకం చూశాం. వాటన్నింటిక పుల్‌స్టాప్ పెట్టేందుకు ఈ ధరణి కార్యక్రమం మంచి ఉదాహరణ.
ఇప్పటికీ పలు గ్రామాల్లో ప్రజలకు పట్టాలు అందలేదనే ఆరోపణలు ఉన్నాయి. పోడు భూముల విషయంలో ఇప్పటికీ ఎమ్మార్వోలు తొలగించిన వివాదాలు ఎన్నో ఉన్నాయి. ధరణి పోర్టల్లో మ్యాపింగ్ అయిన తర్వాత ప్రజల నుంచి నివేదికలు తీసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టం ప్రజల సమక్షంలో కార్యచరణ చేయాలి. ఈ చట్టానికి రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్ తెలంగాణ సమాజంలో చీర స్థాయిగా నిలిచిపోతారు."