తెలంగాణ

telangana

ETV Bharat / state

మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే - jayashankar bhupalpally district news

రైతులు నియంత్రిత వ్యవసాయ పద్దతిలో పంటలను సాగు చేయాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల సర్వ సభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రైతుబంధు, రైతుబీమా, పంట సబ్సిడీ రైతులకు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

mla gandra venkataramana reddy participated in mandal level meeting in jayashankar bhupalpally district
మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

By

Published : Jun 18, 2020, 8:33 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల సర్వ సభ్య సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. విద్యుత్​ శాఖతో పాటు మిగతా శాఖల్లో కూడా సరైన సిబ్బంది లేకపోవడం వల్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. దీనిపై ఆయా శాఖల మంత్రులతో మాట్లాడామని... త్వరలోనే అన్ని శాఖల్లో నియామకాలు జరుగుతాయని చెప్పారు. రైతులు నియంత్రిత వ్యవసాయ పద్దతిలో పంటలను సాగు చేయాలని, ఇందుకోసం వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు, రైతుబీమా, పంట సబ్సిడీ రైతులకు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్​ శాఖ అధికారులు ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా, ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. పెండింగ్​లో ఉన్న పట్టా పుస్తకాలను జులై 15లోపు ప్రజలకు అందించాలని తహసీల్దార్​కు సూచించారు. మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని మండల ప్రజలందరికీ అందించాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, మార్కెట్ ఛైర్మన్, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: ఎమ్మెల్యేలు కోలుకోవాలని తెరాస నాయకుల పాదయాత్ర

ABOUT THE AUTHOR

...view details