Medigadda Barrage Issue Update :మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించి మరో 15 అంశాల సమాచారాన్ని జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులు కేంద్రానికి అందించారు. జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ(National Dam Safety Authority)కి ఈ మేరకు రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులు వివరాలు అందించారు. మిగిలిన రెండు అంశాల సమాచారాన్ని త్వరలోనే ఇస్తామని రాష్ట్ర అథారిటీ తెలిపింది. కుంగిన అనంతరం మేడిగడ్డ ఆనకట్టను పరిశీలించిన కేంద్ర బృందం మొత్తం 20 అంశాలపై వివరాలు కోరింది. అందులో మూడింటి సమాచారాన్ని గతంలోనే అందించారు. మిగిలిన 17 అంశాల సమాచారం 29వ తేదీ లోపు ఇవ్వాలని జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ కోరింది. అందులో 15 అంశాల సమాచారాన్ని రాష్ట్ర అథారిటీ అందించింది.
ఈనెల 23 నుంచి 26వ తేదీన మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) నిర్మాణాన్ని కేంద్ర కమిటీ సందర్శించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బ్యారేజీలో పియర్‌కు పగుళ్లకు సంబంధించిన అంశాలపై కోరిక సమాచారం వెంటనే ఇవ్వాలని కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ డ్యామ్ భద్రత అథారిటీ మరో లేఖను రాసింది. ఈ విషయాలపై ఆదివారం లోగా వివరాలు ఇవ్వాలని అందులో పేర్కొంది.
Medigadda Barrage Issue : మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు.. రాష్ట్రానికి కేంద్రం అల్టిమేటం
Medigadda Barrage Damage at Bhupalaplly :ఈ మేరకు అంతకు ముందు ఇచ్చిన మూడు అంశాలతో పాటు, మరో 15 అంశాల సమాచారాన్ని జాతీయ డ్యాం సేఫ్టీ అధికారులకు అందించారు. వారు కేంద్రానికి ఈ నివేదికను సమర్పించారు. మరో రెండు అంశాలపై త్వరలో సమాచారం ఇస్తామని చెప్పారు. అయితే రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్‌కు కేంద్ర జలమంత్రిత్వ శాఖ డైరెక్టర్ కూడా లేఖ రాశారు.