ఉమ్మడి వరంగల్ జిల్లాలో మావోయిస్టుల లేఖలు మరోసారి కలకలం రేపాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం పంబాపూర్ గ్రామ సర్పంచ్ బంటు రమేష్‌కు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరిస్తూ.. గ్రామ సమీపంలో ఓ గోడకు మావోల లేఖ వెలిసింది. కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఏరియా కమిటీ పేరు మీద కరపత్రాలు వెలువడ్డాయి.
గ్రామాల్లో ప్రజాప్రతినిధుల అరాచకాలు పెరిగాయి. గ్రామ అధ్యక్షులు, సర్పంచ్ బంటు రమేష్‌కు ప్రజా కోర్టులో శిక్ష తప్పదు. 8 ఏళ్ల క్రితం బోర్లగూడెంలో వెంకటేశ్వరరావుకు పట్టిన గతే నలుగురుకి పడుతుంది.