కన్నులపండువగా శ్రీనివాస కల్యాణం - lord venkateshwara
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని కృష్ణాకాలనీలో శ్రీనివాసుని కల్యాణమహోత్సవం కన్నులపండువగా జరిగింది. ఈ వేడుకను చూసేందుకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు.
కన్నులపండువగా శ్రీనివాస కల్యాణం
భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని కృష్ణాకాలనీలో శ్రీనివాస కల్యాణమహోత్సవం రంగరంగవైభవంగా జరిగింది. తితిదే, హిందూ ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి కల్యాణం నిర్వహించారు. ఈ ఘట్టాన్ని తిలకించడానికి వర్షంలోనూ పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. వేదమంత్రాల మధ్య పండితులు కల్యాణం జరిపించారు.
- ఇదీ చూడండి : పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం