తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రాదేశిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ప్రాదేశిక ఓట్లు లెక్కింపునకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆయా కేంద్రాల వద్ద పోలీసులను మోహరించారు.

By

Published : Jun 3, 2019, 10:06 PM IST

ప్రాదేశిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

ప్రాదేశిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

వరంగల్​ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం రేపు తేలనుంది.
వరంగల్​ అర్బన్​ జిల్లా కాజీపేట మండలంలోని మడికొండ గురుకుల పాఠశాల, రాంపూర్​ వీఎంఆర్​ పాలిటెక్నిక్​ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. హసన్​పర్తి, కమలాపూర్​, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, ధర్మసాగర్​, వేలేరు, ఐనవోలు మండలాల ఓట్లు ఈ కేంద్రాల్లో లెక్కించనున్నారు. కలెక్టర్​ జీవన్​ పాటిల్​ కేంద్రాలను సందర్శించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
వరంగల్​ గ్రామీణ జిల్లాకు సంబంధించి గణపతి ఇంజినీరింగ్​ కళాశాల, నర్సంపేట బాలాజీ ఉన్నత పాఠశాలలో ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
మహబూబాబాద్​ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కించేందుకు ఫాతిమా ఉన్నత పాఠశాల, తొర్రూరులోని ఆర్యభట్ట పాఠశాలలో అధికారులు ఏర్పాట్లు చేశారు.
జనగామ జిల్లాకు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు పట్టణంలోని ప్రతాప్​ ఇంజినీరింగ్​ కళాశాల, పెంబర్తిలోని విశ్వభారతి ఇంజినీరింగ్​ కళాశాల, ఏకశిలా బీఈడీ కళాశాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు.
భూపాలపల్లి జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపును జిల్లా పరిషత్​ పాఠశాల, సింగరేణి ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏర్పాట్లు చేశారు.
ములుగు జిల్లాలో స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపునకు ఏటూరి నాగారం, ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు.

ABOUT THE AUTHOR

...view details