కన్నెపల్లి పంపుహౌస్‌లో ఐదో పంపు ప్రారంభం
తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఈరోజు కన్నెపల్లి పంపుహౌస్‌లో ఐదో పంపు ప్రారంభమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాహాదేవ్పూర్ మండలంలో ప్రాజెక్టు నిర్మాణాల వద్ద జలకళ సంతరించుకుంది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంపుహౌస్ ఈరోజు ఒకటవ పంపును ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు రన్ చేయడం వల్ల జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ మండలంలో జల కళ సంతరించుకుంది. ఇప్పటికే ప్రారంభించిన 3,4,5,6 పంపుల ద్వారా ఏకధాటిగా జలధార పరుగులు తీస్తూ గ్రావిటీ ద్వారా అన్నారం బ్యారేజీ గోదావరిలో కలిసిపోయాయి. ఒక్కపంపు 24 గంటలకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తోందని ఇంజినీర్లు చెబుతున్నారు. మేడిగడ్డ బ్యారేజీ 85 గేట్లు మూసివేయడం వల్ల ప్రవాహం ఎదురొస్తూ కాళేశ్వరం ఎగువకు చేరింది. మేడిగడ్డ నుంచి 6 టీఎంసీల నీటి నిల్వతో 11 వేల క్యూసెక్కులుగా కన్నెపల్లి పంపుహౌస్ వద్దకు చేరింది.
- ఇదీ చూడండి :జల సంరక్షణకు కదం తొక్కిన మహిళా శక్తి