భూపాలపల్లిలో జాబ్ మేళా - sp
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ ఆర్.భాస్కరన్ హాజరయ్యారు.
హాజరైన యువతియువకులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి మినీ ఫంక్షన్ హాల్లో అపోలో మెడిస్కిల్స్ , పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి జాబ్ మేళాకు యువతి యువకులను తరలి వచ్చారు. ప్రజలను అభివృద్ధి దిశగా నడిచే విధంగా కార్యక్రమాలు చేపడతామని ఎస్పీ తెలిపారు.